: ఆ సినిమా చూసిన ప్రతిసారి భయపడుతుంటాను: ప్రభుదేవా
తనకు హారర్ మూవీస్ చూడటం అంటే ఇష్టమని, ‘ఈవిల్ డెడ్’ చిత్రం ఇప్పటికి ఎన్నోసార్లు చూశానని, చూసిన ప్రతిసారి భయపడ్డానని ప్రముఖ డైరెక్టర్ ప్రభుదేవా అన్నాడు. ‘కథను బట్టి హీరోను సెలెక్ట్ చేసుకోవడమా? లేక హీరోను బట్టి కథను సెలెక్ట్ చేసుకోవమా?.. ఈ రెండింటిలో ఏది తేలిక?' అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘ఈ రెండూ కష్టమే. అది ఒక ప్రాసెస్... అది ఎలాగో నాకు తెలియదు. ఇట్ హాజ్ టూ హేపెన్’ అని చెప్పారు. లోబడ్జెట్ సినిమాలు సూపర్ హిట్ అవడం, భారీ బడ్జెట్ సినిమాలు అట్టర్ ప్లాఫ్ కావడం అనేవి జరుగుతుంటాయని, వాటిని పట్టించుకోకుండా పనిచేసుకుంటూ ముందుకు పోవాలని మరో ప్రశ్నకు ప్రభుదేవా జవాబిచ్చాడు.