: ఉత్తమ్ నియామకాన్ని తప్పుపట్టడమంటే హైకమాండ్ ను వేలెత్తిచూపడమే: జానారెడ్డి
టీపీసీసీకి సారథిగా పొన్నాల లక్ష్మయ్య కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపిక చాలా దారుణమంటూ కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకమయ్యారన్నారు. ఈ నియామకాన్ని తప్పుబట్టడమంటే హైకమాండ్ ను వేలెత్తిచూపడమేనన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో వ్యక్తిగత దూషణలకు దిగడం ఇది సమయం కాదన్నారు.