: నకిలీ ఫేస్ బుక్ అకౌంటుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అమీర్ ఖాన్ భార్య
తన పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ తెరిచారంటూ ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫొటోలు అప్ లోడ్ చేస్తూ స్నేహితులు, బంధువులతో తన పేరుపై చాటింగ్ చేస్తున్నట్లు బాంద్రాలోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమతో చాట్ చేసిన విషయాలను కిరణ్ రావు ఫ్రెండ్స్ ఆమె వద్ద ప్రస్తావించారు. దీంతో, స్వయంగా కిరణ్ రావే తన పేరిట ఉన్న నకిలీ అకౌంట్ ను చూసి ఆశ్చర్యపోయింది. ఈమేరకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.