: తణుకులో చేపల వాన... పట్టుకునేందుకు పోటీపడ్డ ప్రజలు!
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపల వాన కురిసింది. దీంతో చేపలను పట్టుకునేందుకు అక్కడి ప్రజలు పోటీ పడ్డారు. తణుకు జాతీయ రహదారి వెంబడి వర్షంతో పాటు చేపలు కూడా కురిశాయి. దీంతో, ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. కాగా, గత ఏడాది కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని గోళ్లమూడి, పల్లగిరి గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూముల్లో ఆకాశంలో నుంచి చేపలు, కప్పలు రాలిబడ్డాయి.