: టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల పరస్పరదాడులు


అనంతపురంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు జగన్ క్షమాపణ చెప్పాలంటూ అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ లో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగి, పరస్పర దాడులు జరిగాయి. దీంతో, ఉద్రికత్త పరిస్థితులు చోటుచేకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు రెండు పార్టీలకు చెందిన పలువురుని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News