: కార్మికులతో కలిసి భోజనం చేసిన ప్రధాని మోదీ


ప్రస్తుతం ఖతార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, భారత కార్మికులతో కలిసి భోజనం చేశారు. 'దోహ'లోని భారత కార్మికుల క్యాంప్ ను నిన్ని సాయంత్రం ఆయన సందర్శించి, అక్కడ పని చేస్తున్న కార్మికులతో కలిసి మాట్లాడారు. భారత కంపెనీలు, కార్మికులు ఎదర్కొంటున్న సమస్యలను ప్రధాని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. మోదీ ఉత్తమ ప్రధాని అని ఒకరు, మా కుటుంబ సభ్యుల్లోని వ్యక్తి తమతో కూర్చుని భోజనం చేసినట్లుందని మరొక కార్మికుడు, తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారని చెమర్చిన కళ్లతో ఇంకొక కార్మికుడు చెప్పారు.

  • Loading...

More Telugu News