: మంచి సబ్జెక్టుతో పాటు అన్నీ కుదిరితేనే విజయం: హీరో ఆది
ఏ సినిమా అయినా హిట్ అవాలంటే... మంచి సబ్జెక్టుతో పాటు ప్రతి అంశం కలిసిరావాలని హీరో ఆది అన్నాడు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'సినిమాకు సబ్జెక్టనేది చాలా ముఖ్యమైనదే. దీంతో పాటు, చిత్రం రిలీజు చేసే టైమ్ తో పాటు చాలా అంశాలు కలిసివస్తేనే చిత్రం విజయవంతమవుతుంది' అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘టాలెంట్ తో పాటు లక్ అనేది కూడా కచ్చితంగా ఉండాలంటారు, అలానే, మంచి సబ్జెక్టుతో పాటు రిలీజ్ డేట్ కుదిరి, ఆ టైంలో జనం మూడ్ కూడా బాగుంటే చిత్రం విజయవంతమవుతుంది. అయితే, మంచి చిత్రాలను ప్రజలెప్పుడూ మిస్ చేయరు’ అని చెప్పాడు. మనమేదైతే నమ్మమో దానికోసం వందశాతం కష్టపడి పనిచేసి, చిత్రాన్ని విడుదల చేస్తే, ఇక ఆ చిత్రం ఎటువంటిదో ప్రేక్షకులే చెబుతారన్నది తన అభిప్రాయమని ఆది పేర్కొన్నాడు.