: టీడీపీలోకి మారినా ప్రజలకు ఏమీ చేయలేకపోయానంటూ పదవులకు రాజీనామా చేసిన దళిత నేత
వైఎస్ఆర్ పార్టీ మద్దతుతో వార్డు సభ్యుడిగా గెలిచి, ఆపై వీతానగరం చినబోగిలి పంచాయతీకి ఉప సర్పంచ్ గా ఎన్నికై, ఫిరాయింపు ఆకర్షణకులోనై, తెలుగుదేశం పార్టీలో చేరిన దళిత నేత డేవిడ్ కుమార్, ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఉపసర్పంచ్ పదవిని, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ పదవికి కూడా రిజైన్ చేసినట్టు చెప్పారు. తెలుగుదేశంలో చేరితే, ప్రజలకు మరింత సేవ చేయవచ్చని భావించానని, ఇక్కడా ఫలితం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఇకపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తగా, ప్రజల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.