: ఫేస్ బుక్ లో యువతులను వేధిస్తున్న కాకినాడ ప్రొఫెసర్ అరెస్ట్


పవిత్రమైన అధ్యాపక వృత్తిలో పనిచేస్తూ, విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్ మెంటులో శిక్షణ ఇస్తున్న ప్రొఫెసర్, తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా యువతులకు అశ్లీల చిత్రాలు, అసభ్య మెసేజ్ లు పంపుతూ అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కాకినాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న కారాని నరేష్, తప్పుడు ఫేస్ బుక్ ఖాతా ప్రారంభించాడు. అమ్మాయిలకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం చేసుకుని, ఆపై అసభ్య మెసేజ్ లు, చిత్రాలు పంపుతూ వేధిస్తుండేవాడు. దీనిపై పెనుగొండకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ తరహా కేసుల్లో చాలా వరకూ ఫిర్యాదులు రావడం లేదని, సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేసే వేళ, అమ్మాయిలు జాగ్రత్తలు పాటించాలని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News