: రద్దీ దృష్ట్యా విశాఖ, విజయవాడ మీదుగా కొత్త రైళ్లు
వేసవి ముగియనున్న తరుణంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు విశాఖపట్నం, విజయవాడ మీదుగా కొత్త రైళ్లను నడపనున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ మేనేజర్ తెలిపారు. ప్రత్యేక జనసాధారణ్ సూపర్ ఫాస్ట్ రైళ్లు సంత్రగచ్చి నుంచి చెన్నైకి నడుస్తాయని, ఇవి ఖరగ్ పూర్, ఖుర్దారోడ్, విశాఖ, విజయవాడ, నెల్లూరు మీదుగా ప్రయాణిస్తాయని తెలిపారు. 29వ తేదీ వరకూ విశాఖ నుంచి గురు, ఆదివారాల్లో ఉదయం 7:55కు చెన్నై వైపునకు, మంగళ, శని వారాల్లో రాత్రి 8:35 గంటలకు సంత్రగచ్చి వైపు రైళ్లుంటాయని వివరించారు. 15 జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్ లు, రెండు సెకండ్ సిట్టింగ్ కోచ్ లు, లగేజ్ కోచ్ లతో ఇవి నడుస్తాయని పేర్కొన్నారు.