: అనంతపురం ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన జగన్
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వైకాపా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ, నేడు అనంతపురం ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగనున్నట్టు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ధర్నా నిర్వహిస్తామని, అందులో తాను స్వయంగా పాల్గొంటానని తెలిపారు. శాంతియుతంగానే తమ నిరసన తెలియజేస్తామని వివరించారు. కాగా, ఈ కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేస్తున్నట్టు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. రెచ్చగొట్టే ప్రకటనలు చేయరాదని, సాయంత్రం 5 గంటల కెల్లా కార్యక్రమాన్ని ముగించాలని తెలియజేసింది.