: మూడు రోజుల పాటు వడగళ్ల వానలు... హెచ్చరించిన వాతావరణ శాఖ
వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు వేగంగా ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, గత రాత్రి నుంచి ముసురు పట్టినట్టుగా వాతావరణం మారగా, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లోని పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఖరీఫ్ సీజనుకు మంచిదని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.