: మహ్మదాలీని మలయాళీ అంటూ నివాళులర్పించిన కేరళ మంత్రి, ఫుట్ బాలర్ అన్న అనదితా పటేల్... సోషల్ మీడియాలో వైరల్


ప్రపంచ ప్రఖ్యాత హెవీ వెయిట్ బాక్సర్ మహ్మదాలీ కేరళ నివాసట. ఇటీవల స్పోర్ట్స్ మినిస్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఈపీ జయరాజన్ ఓ మలయాళ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, ఆయన లోకజ్ఞానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "నేనిప్పుడే విన్నాను. మహ్మదాలీ అమెరికాలో తన ఆఖరి శ్వాసను విడిచారని. ఆయన కేరళ నుంచి ఎదిగిన గొప్ప ఆటగాడు. బంగారు పతకాన్ని గెలవడం ద్వారా కేరళ పతాకాన్ని నింగికి చేర్చాడు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను టీవీ చానల్ ఒక్కసారి మాత్రమే ప్రసారం చేసినప్పటికీ, దీన్ని చూసిన వారు మంత్రి అజ్ఞానాన్ని తమదైన శైలిలో విమర్శిస్తున్నారు. ఇదిలావుండగా, మహ్మదాలీ అభిమానులు శోకసంద్రంలో నిండిన వేళ, ఆయనకు నివాళులు అర్పిస్తూ, అనదితా పటేల్ అనే గుజరాతీ యువతి పెట్టిన ట్విట్టర్ పోస్టు సైతం వైరల్ అయింది. "రొనాల్డో, మారడోనా, మెస్సీ కన్నా ఉత్తమ ఫుట్ బాలర్ అయిన మహ్మదాలీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా" అన్న అనదితానూ విమర్శిస్తూ వ్యాఖ్యలు వస్తున్నాయి. ఆపై తాను అలీని పీలే అని అనుకున్నానని ఆమె వివరణ ఇచ్చుకుంది. దీంతో, ఇక పటేళ్లకు జనరల్ నాలెడ్జ్ క్లాసులపై రిజర్వేషన్లు ఇవ్వాలని నెటిజన్లు జోకులేస్తున్నారు.

  • Loading...

More Telugu News