: సిగ్గుచేటు... మళ్లీ పరీక్ష రాసి పాస్ మార్కు కూడా తెచ్చుకోలేకపోయిన బీహార్ ఇంటర్ టాపర్


బీహారులో పరీక్షల్లో ఎంత అవినీతి జరుగుతుందన్న విషయానికి ఇది మరో ఉదాహరణ. సైన్స్ పరీక్షలో టాపర్ గా నిలిచిన విద్యార్థికి తిరిగి పరీక్ష నిర్వహిస్తే, ఫెయిల్ అయ్యాడు. బోర్డు పరీక్షల్లో కనీసం సోడియం అంటే తెలియని విద్యార్థి టాపర్ గా నిలవడం, అతని తెలివితేటల వీడియో బహిర్గతమై సంచలనం సృష్టించగా, అతనికి మరో పరీక్షను నిర్వహిస్తామని అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే. తొలుత టాపర్ గా నిలవడానికి కాపీయింగే కారణమని భావిస్తున్న అధికారులు, విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. టాపర్లుగా నిలిచిన 13 మందిలో సౌరబ్, రాహుల్ అనే విద్యార్థుల ఫలితాలను నిలిపివేస్తున్నట్టు బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు వెల్లడించింది. మరికొంతమంది టాపర్లకు కూడా తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కాగా, జరిగిన ఘటనలతో డిప్రషన్ లో ఉన్నందునే తన బిడ్డ రెండోసారి పరీక్షలు రాయలేకపోయాడని ఓ విద్యార్థి తండ్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డ, కోలుకున్న తరువాత తన సత్తాను చూపిస్తాడని చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News