: మోదీ తెరచిన ద్వారాలను మూసేస్తున్న పాకిస్థాన్: మనోహర్ పారికర్


పాకిస్థాన్ తో స్నేహ సంబంధాల మెరుగునకు మోదీ చూపిన చొరవను ఆ దేశం దూరం చేసుకుంటోందని రక్షణమంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. పాక్ తో చర్చలను ప్రోత్సహించేలా ఆయన తెరచిన ద్వారాలు మూసుకుపోతున్నాయని ఆయన అన్నారు. "పాక్ ను సందర్శించడం ద్వారా ప్రధాని మోదీ, స్నేహబంధం విస్తరించే అవకాశాల ద్వారాన్ని తెరిచారు. ఇప్పుడు ఉగ్రవాదాన్ని రూపుమాపడంలో ఆ దేశం తన వైఖరిని మార్చుకోకుండా, ఆ ద్వారాలను మూసేస్తోంది" అని అన్నారు. సింగపూర్ లో జరిగిన సెక్యూరిటీ ఫోరమ్ లో పాల్గొన్న పారికర్ అక్కడ ప్రసంగిస్తూ, ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఎంతగా ప్రయత్నిస్తున్నా, పాక్ దగ్గర కాలేకపోతోందని, ఉగ్రవాదానికి మద్దతిస్తూ, ఇండియా, ఆఫ్గనిస్థాన్ దేశాలపైకి ఉసిగొల్పుతోందని పారికర్ విమర్శించారు.

  • Loading...

More Telugu News