: సజీవ దహనమైన మధుర అల్లర్ల సూత్రధారి రామ్ వృక్ష్ యాదవ్


మధురలోని జవహర్ నగర్ లో జరిగిన అల్లర్లు, గృహ దహనాలు, పోలీసులపై దాడుల వెనక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ‘స్వాధీన్ భారత్ వైదిక్ సత్యాగ్రహ్’ ప్రధాన నేత రామ్ వృక్ష్ యాదవ్ సజీవ దహనమైనట్టు పోలీసులు వెల్లడించారు. తాను ప్రారంభించిన గొడవల్లోనే అతను మరణించాడని, ఆయనపై ఎనిమిది పోలీసు కేసులున్నాయని తెలిపారు. గత వారంలో ఆక్రమణలను ఖాళీ చేయించేందుకు పోలీసులు వెళ్లిన సమయంలో, సుమారు 3 వేల మంది రామ్ వృక్ష్ యాదవ్ అనుచరులు తుపాకులు, గ్రనేడ్లతో పోలీసులపై దాడులు చేసి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. వీరు వందలాది వంటగ్యాస్ సిలిండర్లను పేల్చి, పెద్ద పేలుడును సృష్టించగా, ఈ ప్రమాదంలోనే యాదవ్ మృతి చెందినట్టు ఉత్తరప్రదేశ్ పోలీస్ చీఫ్ జావేద్ అహ్మద్ తెలిపారు. మరణించిన వారిలో యాదవ్ మృతదేహాన్ని ఆయన అనుచరులు గుర్తించారని తెలిపారు. మొత్తం 24 మంది మరణించారని, వారెవరన్న విషయాన్ని గుర్తించే పనిలో ఉన్నామని వివరించారు.

  • Loading...

More Telugu News