: హైదరాబాద్ లో భారీ వర్షం, కరెంటు లేక ప్రజల ఇబ్బందులు!


హైదరాబాద్ లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో ఈ ఉదయం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవగా, జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు కూలిపోవడంతో కరెంటు లేక ప్రజలు జాగారం చేయాల్సి వచ్చింది. దాదాపు మూడు గంటల పాటు వర్షం ఏకధాటిగా కురవగా, లోతట్టు ప్రాంతాల్లో నీరు రెండు నుంచి మూడు అడుగుల మేరకు నిలిచింది. మరోవైపు ఏపీలోని కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ రాత్రి భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబడి రుతుపవనాల రాకకు మార్గం సుగమమైంది. కృష్ణా జిల్లాలో రెండు చోట్ల పిడుగులు పడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొత్త వలస ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. నేడు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News