: రాజీనామా చేసిన తరువాతే వస్తానన్న గుత్తా: ఓకే చెప్పిన కేసీఆర్


టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, తన పదవికి రాజీనామా చేసిన తరువాత మాత్రమే రాగలనని ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇందుకు తొలుత సమ్మతించని కేసీఆర్, ఆపై కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఉండటం, అనర్హత వేటు పడవచ్చన్న అనుమానంతో గుత్తా అభిప్రాయానికి 'ఓకే' చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన్ను క్యాబినెట్ లోకి తీసుకోవడం లేదా క్యాబినెట్ హోదాగల పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. గుత్తాను పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచన హరీశ్ రావుదని, ఆయనే మంత్రాంగం నడిపించగా, ఆపై రెండు రోజుల క్రితం తన ప్రధాన అనుచరులతో కేసీఆర్ వద్దకు వచ్చిన ఆయన, మూడు గంటల పాటు చర్చలు జరిపారు. రాజీనామా చేయడం ద్వారా నైతిక విలువలకు కట్టుబడి ఉన్నామన్న సంకేతాలు పంపవచ్చని గుత్తా చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ అభినందించినట్టు సమాచారం. ఇక ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే నల్లగొండ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ తరఫున పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరిలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News