: 'గ్రాండ్ స్లామ్' కొత్త రాణి... సెరెనాపై సంచలన విజయం సాధించిన ముగురుజా


గత సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తానెదుర్కున్న ఓటమికి స్పెయిన్ యువ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజా ప్రతీకారం తీర్చుకుంది. తనను ఆనాడు ఓడించిన సెరినా విలియమ్స్ పై సంచలన విజయం సాధించి, తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. పారిస్ లోని రోలాండ్ గారోస్ లో జరిగిన మహిళల ఫైనల్స్ పోరులో 22వ టైటిల్ సాధించి స్టెఫీగ్రాఫ్ రికార్డును సమం చేయాలన్న సెరీనాకు నిరాశను మిగిల్చింది. ఫ్రెంచ్ ఓపెన్ లో గత తొమ్మిదేళ్ల ఆనవాయితీని కొనసాగిస్తూ, డిఫెండింగ్ చాంపియన్ ఓడిపోవడం గమనార్హం. గత రాత్రి జరిగిన ఫైనల్ లో నాలుగో సీడ్ గా బరిలోకి దిగిన ముగురుజా 7-5, 6-4 తేడాతో, రెండు గంటల్లోపే రెండు వరుస సెట్లలో సెరెనాపై గెలిచింది. ఈ గెలుపుతో ముగురుజాకు 20 లక్షల యూరోలు (సుమారు రూ. 15.18 కోట్లు) రన్నరప్ గా నిలిచిన సెరెనాకు 10 లక్షల యూరోలు (సుమారు రూ. 7. 59 కోట్లు) ప్రైజ్‌ మనీగా లభించాయి. తొమ్మిది డబుల్ ఫాల్ట్‌ లు చేసినప్పటికీ, కీలక సమయాల్లో నాలుగుమార్లు సెరెనా సర్వీస్‌ ను ముగురుజా బ్రేక్ చేయడం ఆమెను విజేతగా నిలిపింది. పెద్దగా అనవసర తప్పిదాలు చేయనప్పటికీ, సర్వీస్ ను నాలుగు సార్లు కోల్పోవడం సెరీనాకు కప్పును దూరం చేసింది.

  • Loading...

More Telugu News