: విద్యుత్ శాఖాధికారి రాసలీల... రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వైనం!


అవినీతికి పాల్పడి రెండుసార్లు ఏసీబీకి పట్టుబడిన ఏపీ ఈపీడీసీఎల్ చింతూరు ఏడీఈ మధుసూదనరావు, ఈసారి ఏకంగా రాసలీలలాడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. రాజమండ్రిలోని శ్యామలానగర్‌ లోని పాత సోమాలమ్మ గుడి సమీపంలో ఉన్న ఏపీ పవర్ డిప్లమో ఇంజనీర్స్ అసోసియేషన్ గెస్ట్‌ హౌస్‌ లో మధుసూదనరావు రాసలీలల్లో మునిగి ఉన్నాడని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో దాడి చేసిన పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అయితే, ఈ సందర్భంగా మధుసూదనరావు చెబుతూ, ఆ మహిళకు, తనకు సంబంధం లేదని, మోహన్ అనే కాంట్రాక్టర్ రూమ్ బుక్ చేశాడని, ఎదో పని ఉంది, రావాలి అని పిలిస్తే తాను వచ్చానని బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో మండిపడ్డ పోలీసులు, ముందు రోజు రాత్రి కూడా అదే గదిలో మరో యువతితో ఎలా గడిపావంటూ సాక్ష్యాలతో సహా నిలదీశారు. దీంతో ఆయన మౌనంగా వారి వెంట నడిచాడు. మహిళా సహా ఆయనను న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News