: అమరనాథ్ యాత్రికులపై తీవ్రవాదుల కన్ను: ఇంటెలిజెన్స్ హెచ్చరికలు


త్వరలో యాత్రకు బయలుదేరనున్న అమరనాథ్ యాత్రికులపై తీవ్రవాదుల కన్ను పడిందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసిందని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి తెలిపారు. జమ్మూకాశ్మీర్ లోని బిజ్ బెహరాలో బీఎస్ఎఫ్ చీఫ్ మాట్లాడుతూ, అమరనాథ్ యాత్రకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూసుకుంటామని అన్నారు. గత ఏడాదిలా వారి ఆటలు సాగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. బిజ్ బెహరాలో నిన్న ఆకస్మికంగా జరిగిన తీవ్రవాద దాడిలో వీర జవాన్లను కోల్పోయామని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ తెలిపారు. ఈ దాడిని ఊహించలేకపోయామని ఆయన చెప్పారు. ఇలాంటి దాడులతో తమ ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేరని, దాడులకు పాల్పడినవారు తప్పించుకోలేరని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వీర జవాన్లకు ఆయన నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News