: మోదీకి ఆఫ్ఘన్ అత్యున్నత పురస్కారం ప్రదానం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఈరోజు ఆఫ్ఘనిస్థాన్ తమ దేశ అత్యన్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్థాన్‌లో పర్యటించిన మోదీకి అధ్యక్షుడు అష్రఫ్ ఘని తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'ఆమిర్ అమానుల్లా ఖాన్' పురస్కారాన్ని ప్రదానం చేశారని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో కలసి మోదీ ఆ దేశంలో ఈరోజు ‘ఆఫ్ఘన్-ఇండియా ప్రెండ్ షిప్ డ్యామ్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం చేశారని వికాస్ స్వరూప్ తెలిపారు. ఈ సందర్భంగా వికాస్ స్వరూప్ తన ట్విట్టర్ లో ‘నిజమైన సోదరభావానికి లభించిన గౌరవం ఇది’ అని పేర్కొన్నారు.