: నా రికార్డును జేమ్స్ ఆండర్సన్ అధిగమించగలడు: మెక్ గ్రాత్


తన రికార్డును అధిగమించగల సత్తా ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కు మాత్రమే ఉందని ఆసీస్ దిగ్గజ బౌలర్ మెక్ గ్రాత్ తెలిపాడు. మెల్ బోర్న్ లో మెక్ గ్రాత్ మాట్లాడుతూ, ఆండర్సన్ నాణ్యమైన బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నాడు. బంతులను వేగంగా సంధించడమే కాకుండా వాటికి స్వింగ్ జోడించడం కూడా ఆండర్సన్ ప్రత్యేకత అని చెప్పాడు. అలాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారని మెక్ గ్రాత్ చెప్పాడు. 100 టెస్టులు ఆడడమే కష్టమైన ప్రస్తుత తరుణంలో 115 టెస్టులు ఆడి నిలకడ నిరూపించుకున్నాడని ఆండర్సన్ ను మెక్ గ్రాత్ అభినందించాడు. ఇంకా ఆడుతుండడంతో తన 563 వికెట్ల రికార్డును సాధించే సత్తా ఆండర్సన్ లో ఉందని అన్నాడు. కాగా, ఇప్పటికే ఆండర్సన్ 450 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News