: వైట్ హౌస్ ఖాళీ చేశాక ఒబామా నివాసం ఎక్కడంటే...!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీ కాలం మరి కొన్ని నెలల్లో ముగియనుంది. అనంతరం వైట్ హౌస్ ను ఖాళీ చేశాక, ఆయన వాషింగ్టన్‌లోని కలోరమలో నివసించనున్నారట. అక్కడ 8200 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1928లో నిర్మించిన ఓ బిల్డింగ్‌లో ఒబామా కుటుంబం నివసించనుంది. ఈ భవనం తొమ్మిది బెడ్‌రూమ్‌లను కలిగి ఉంది. అక్కడ ఉన్న గ్యారేజ్‌లో పది కార్లు పట్టేంత స్థలం ఉంది. ఈ భవనంలో మే 2014 వరకు వైట్ హౌస్ మాజీ సెక్రటరీ జో లాక్ హార్ట్ నివసించేవారు. ఆ తరువాత ఈ భవనాన్ని అమ్మేశారు. ఒబామా దంపతుల చిన్న కుమార్తె తన హైస్కూల్ చదువును పూర్తి చేసే వరకు ఒబామా కుటుంబం ఈ భవనంలోనే నివాసం ఉండనుంది.