: అడవిలో తినడానికి ఏమీ దొరకలేదు... నీళ్లు తాగుతూ గడిపాను: జపాన్ అడ‌విలో త‌ప్పిపోయిన చిన్నారి


‘ఆ ఆరు రోజులూ అడవిలో దొరికిన నీరు తాగుతూ గడిపా'నని జపాన్‌లోని హొకైదో ద్వీపం అటవీ ప్రాంతంలో తప్పిపోయిన ఏడేళ్ల బాలుడు యమాటో చెప్పాడు. ఈ చిన్నారి చేసిన చిన్నత‌ప్పుకి కోపగించుకున్న తల్లిదండ్రులు ఎలుగుబంట్లు అధికంగా ఉండే అటవీ ప్రాంతంలో అతనిని వదిలి వెళ్లిన సంగతి విదిత‌మే. కాసేపటికి మళ్లీ వారు వచ్చి చూసే సరికి అక్కడ తమ బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడి కోసం అడ‌విలో జపాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. చివ‌ర‌కు బాలుడు సురక్షితంగా దొరికాడు. ఆ సమీపంలోని మిట‌ల‌రీ బేస్ క్యాంప్ వ‌ద్ద బాలుడు ప‌డుకొని ఉండ‌డం చూసిన పోలీసులు అత‌న్ని ఆసుప‌త్రికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం బాలుడు పోలీసుల‌కి ప‌లు విష‌యాలు వివ‌రించాడు. తాను అడ‌విలో గ‌డిపిన ఆరు రోజుల పాటు అక్క‌డ త‌న‌కు తిన‌డానికి ఏమీ ల‌భించ‌లేద‌ని, దాంతో మంచినీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నానని అన్నాడు. పోలీసులు ఇతనిని గుర్తించగానే, తనకు ఆకలిగా వుందని, ఏదైనా పెట్టమని ఆ బాలుడు అడిగాడట!

  • Loading...

More Telugu News