: రైల్వే జోన్ ఇవ్వమని చెప్పలేదు...పరిగణనలోకి తీసుకొమ్మంది: సురేష్ ప్రభు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఏపీకి రైల్వే జోన్ కేటాయించాలని స్పష్టంగా పేర్కొనలేదని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని మాత్రమే పేర్కొందని అన్నారు. దానిని తాము పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే జోన్ తో సంబంధం లేకుండా ఏపీ రైల్వేలలో సంస్కరణలు మొదలుపెట్టామని ఆయన చెప్పారు. తిరుపతి వెంకన్న సన్నిధిని కలిగి ఉన్న భాగ్యం ఏపీకి దక్కిందని ఆయన చెప్పారు. ఏపీ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.