: రైల్వే జోన్ గురించి అడిగాం...ఆయన ఓకే చెప్పారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రాతినిధ్యం వహించడం రాష్ట్రానికి లాభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి సురేష్ ప్రభుతో రైల్వే జోన్ అంశం చర్చించామని అన్నారు. ఆ విషయాన్ని విభజన చట్టంలో కూడా పేర్కొన్నారని ఆయనకు సూచించామని చంద్రబాబు తెలిపారు. వాటన్నింటినీ పరిశీలిస్తానని కేంద్ర మంత్రి చెప్పారని ఆయన పేర్కొన్నారు. దేశంలో పలు ప్రాంతాలతో కనెక్టివిటీ కావాలంటే విజయవాడ చాలా ఇంపార్టెంట్ అని, అందుకే ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 22 వేల కోట్ల రూపాయల పనులు చేపట్టినట్టు కేంద్ర మంత్రి తెలిపారని ఆయన చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారని సీఎం చెప్పారు.