: ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో చీలిక!... డెడ్ లైన్ వల్ల రెండు వర్గాలుగా విడిపోయిన వైనం!
ఈ నెల 27లోగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలిరావాల్సిందేనన్న ఏపీ ప్రభుత్వ డెడ్ లైన్... హైదరాబాదులో పనిచేస్తున్న ఆ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల్లో చీలికను తెచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అమరావతికి వెళతామని కొందరంటుంటే... మౌలిక వసతులన్నీ కల్పించే దాకా హైదరాబాదు వీడేది లేదని మరి కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటిదాకా ఒక్కతాటిపై నడిచిన సచివాలయ ఉద్యోగుల్లో చీలిక తప్పలేదు. అయితే, ఐదు రోజుల పని విధానం, అదనపు హెచ్ ఆర్ఏ తదితర తాయిలాలను ప్రకటించిన ప్రభుత్వం మాత్రం ఉద్యోగులంతా అమరావతికి తరలిరావాల్సిందేనని చెబుతోంది. దీనిపై రానున్న రోజుల్లో మరింత రచ్చ జరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.