: ఆఫ్ఘన్-భారత్ ఫ్రెండ్ షిప్ డ్యామ్‌తో ప్రజల జీవితాల్లో వెలుగులు: ఆఫ్ఘనిస్థాన్‌లో మోదీ
ఐదు దేశాల పర్యటనలో భాగంగా కొద్ది సేపటి క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్ఘనిస్థాన్ లోని హెరాత్‌కు చేరుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో కలసి మోదీ అక్కడ ‘ఆఫ్ఘన్-ఇండియా ప్రెండ్ షిప్ డ్యామ్’ను ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఆఫ్ఘన్-భారత్ ఫ్రెండ్ షిప్ డ్యామ్‌తో ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని అన్నారు. ఆఫ్ఘన్‌లో నిర్మించిన డ్యామ్‌కు ‘ఆఫ్ఘన్-ఇండియా ఫ్రెండ్ షిప్ డ్యామ్’ అని పేరు పెట్టినందుకు మోదీ ఆ దేశాధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈరోజు కేవలం డ్యామ్‌ని మాత్రమే ప్రారంభించడం లేదని, ప్రజల జీవితాల్లో కొత్త పనిని మొదలు పెట్టామని ఆయన వ్యాఖ్యానించారు. అంతకు ముందు మాట్లాడిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ భారత్ సాయంతో ఈరోజు తమ నలభై ఏళ్ల నిరీక్షణ ఫలించిందని అన్నారు.