: చంద్రబాబుకు తోలు మందం ఎక్కువైంది!: మరింత ఘాటు వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును చెప్పులతో కొట్టాలంటూ మొన్న ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై నిరసనలు వెల్లువెత్తుతుంటే ఏమాత్రం వెనుకంజ వేయని జగన్... అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్ పీ కుంటలో నేటి రైతు భరోసా యాత్రలో భాగంగా మరోమారు చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తోలు మందం ఎక్కువైందని, అందుకే రైతులను పట్టించుకోవడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. హిట్లర్ లా వ్యవహరిస్తున్న చంద్రబాబు భూ కుంభకోణాలకు పాల్పడుతున్న వారిని రక్షిస్తున్నారని ఆరోపించారు. సోలార్ హబ్ కోసం భూములు కోల్పోయిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం పరిహారం అందజేయడంలో తాత్సారం చేస్తోందని ఆయన విరుచుకుపడ్డారు.