: ‘మహా’ డ్రామాకు తెర!... మంత్రి పదవికి ఖడ్సే రాజీనామా!


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు, అవినీతి ఆరోపణలు... మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సేను సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశాయి. చివరకు తన మంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. బీజేపీ మహారాష్ట్ర శాఖలో కీలక నేతగా ఎదిగిన ఖడ్సేకు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఖడ్సేకు దావూద్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవని ఇటీవల ఓ సంచలన విషయాన్ని మరాఠా పత్రికలు వెలుగులోకి తెచ్చాయి. ఈ వ్యవహారం తేలకముందే ఖడ్సేపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విజ్ఞప్తికి ఖడ్సే ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక ఫడ్నవీస్ నిన్న ఢిల్లీ వెళ్లి పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు వివరించారు. ఈ వ్యవహారంపై మోదీ, అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఖడ్సే దిగిరాక తప్పలేదు. కొద్దిసేపటి క్రితం ఆయన తన రాజీనామా లేఖను ఫడ్నవీస్ కు అందజేశారు.

  • Loading...

More Telugu News