: మధురలో ఎంపీ హేమమాలిని... అనుమతి లేదని అడ్డగించిన పోలీసులు


భూ దురాక్రమణదారుల ఆగడాలతో సొంత నియోజకవర్గం ఓపక్క తగలబడిపోతుంటే... చక్కగా షూటింగులో తీయించుకున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ కామెంట్లు పెట్టిన మధుర ఎంపీ, ప్రముఖ సినీ నటి హేమమాలినిపై నెటిజన్లు సెటైర్లేశారు. దీంతో మేల్కొన్న హేమ సదరు ఫొటోలను తొలగించి కొద్దిసేపటి క్రితం మధుర వెళ్లారు. అల్లర్లు చోటుచేసుకున్న ప్రదేశాన్ని సందర్శించేందుకు ఆమె యత్నించారు. అయితే అనుమతి లేదంటూ ఆమెను యూపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెరసి అక్కడ మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News