: బాక్సింగ్ దిగ్గజం ఇక లేరు!... అమెరికాలో కన్నుమూసిన మహ్మద్ అలీ


ప్రపంచం గర్వించదగ్గ బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ(74) ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో మొన్న రాత్రి ఆసుపత్రిలో చేరిన మహ్మద్ అలీ కొద్దిసేపటి క్రితం శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. మూడు పర్యాయాలు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన అలీ 1981లో ఆ క్రీడకు గుడ్ బై చెప్పారు. తదనంతర కాలంలో పార్కన్సన్స్ వ్యాధితో సతమతమైన అలీ పలుమార్లు ఆసుపత్రిలో చేరారు. సుదీర్ఘ కాలం పాటు చికిత్స తీసుకుంటున్న అలీ మొన్న రాత్రి శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ఆయనను కుటుంబ సభ్యులు అమెరికాలోని ఫీనిక్స్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఓ రోజు పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అలీ కోలుకోలేక ఆసుపత్రి బెడ్ పైనే కన్నుమూశారు.

  • Loading...

More Telugu News