: తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన ముసురు!... భారీ వర్షాలతో జన జీవనం అతలాకుతలం!


నైరుతి రుతు పవనాలు పలకరించకముందే తెలుగు రాష్ట్రాలను ముసురు కమ్మేసింది. నిన్న సాయంత్రం నుంచి మొదలైన వరుణుడి ప్రభావం అంతకంతకూ పెరిగింది. రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల పిడుగులు కూడా పడ్డాయి. ఈ కారణంగా పెద్దగా నష్టం లేకున్నా జనజీవనం మాత్రం అతలాకుతలమైంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు జిల్లాల్లోని వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులోనూ నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక నేడు తెల్లవారిన తర్వాత కూడా ముసురు వీడలేదు. ఈ కారణంగా వాతావరణం చల్లబడినట్లుగా అనిపిస్తున్నా. నగరంలో జన జీవనం పెను ప్రభావానికి గురైంది.

  • Loading...

More Telugu News