: అమరావతిలో కల్తీ మద్యం కలకలం!... నెల వ్యవధిలోనే రెండో ఘటన!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలో కల్తీ మద్యం స్వైర విహారం చేస్తోంది. ఆబ్కారీ, పోలీసుల సంయుక్త సహకారంతో రెచ్చిపోతున్న మద్యం వ్యాపారులు అక్కడ కల్తీ మద్యాన్ని యథేచ్ఛగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల క్రితం అమరావతి పరిధిలో కల్తీ మద్యం కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న చోటుచేసుకున్న మరో ఘటనలో శ్రీనివాసరావు అనే వ్యక్తి చనిపోయాడు. అమరావతి పరిధిలోని రాయల్ వైన్స్ లో కొనుగోలు చేసిన మద్యం తాగిన తర్వాత శ్రీనివాసరావు చనిపోయాడు. కేవలం నెల వ్యవధిలోనే అమరావతి పరిధిలో రెండు కల్తీ మద్యం ఘటనలు నమోదు కావడం గమనార్హం.