: పక్కా ప్లాన్ ప్రకారమే విధ్వంసం!... మధుర అల్లర్లలో వెలుగులోకి వాస్తవాలు!


ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారి సహా 24 మంది మరణానికి కారణమైన ఉత్తరప్రదేశ్ లోని మధుర అల్లర్ల వెనుక ఉన్న అసలు కారణాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే భూ ఆక్రమణదారులు పోలీసులపై విరుచుకుపడ్డారన్న విషయం కాస్తంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలహాబాదు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో భూ ఆక్రమణలను తొలగించేందుకు పోలీసులు వస్తారని ముందుగానే అంచనా వేసిన భూ ఆక్రమణదారులు... పోలీసులపై దాడులకు పక్కాగానే ప్లాన్ రచించుకున్నారు. పోలీసులపై మూకుమ్మడి దాడికి దిగాలని నిర్ణయించుకున్న భూ ఆక్రమణదారులు... అందుకనుగుణంగా భారీ కసరత్తే చేశారు. అప్పటికే పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకున్న విధ్వంసకారులు... వెయ్యి గ్యాస్ సిలిండర్లు, 200 గ్రనేడ్లను సిద్ధం చేసుకున్నారు. తుపాకులు, పదునైన కత్తులను తెచ్చిపెట్టుకున్నారు. మొన్న సాయంత్రం ఆక్రమణలను తొలగించేందుకు పోలీసులు రంగంలోకి దిగగానే ఒక్కసారిగా 3 వేల మందికి పైగా ఆక్రమణదారులు వారిపై విరుచుకుపడ్డారు. విధ్వంసకారుల వ్యూహాలను పసిగట్టలేని కారణంగానే పోలీసులకు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకారుల వ్యూహాలను పసిగట్టడంలో నిఘా వర్గాలు విఫలమయ్యాయని సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవే అంగీకరించడం గమనార్హం.

  • Loading...

More Telugu News