: అంతర్వేదిలో భయాందోళనలు!... ఓఎన్జీసీ పైపు నుంచి లీకవుతున్న గ్యాస్!
తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజీ భయాందోళనలకు చెక్ పడటం లేదు. ఇప్పటికే గ్యాస్ లీక్ కారణంగా ఆ జిల్లాల్లో పలు ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జిల్లాలోని అంతర్వేదిలో ఓఎన్జీసీ గ్యాస్ పైపు నుంచి గ్యాస్ లీకవుతోంది. గ్రామంలోని సెయింట్ మెరీస్ పాఠశాల సమీపంలో గ్యాస్ లీకేజీని గుర్తించిన గ్రామస్తులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజీ కారణంగా గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.