: ఇకపై అమరావతికి సింగిల్ పైసా ఇవ్వలేం!... ఏపీకి షాకిచ్చిన కేంద్రం!


రాష్ట్ర విభజనతో ఇప్పటికే ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నిన్న షాకిచ్చే వార్తను వినిపించింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఇకపై సింగిల్ పైసా విడుదల చేయలేమని స్పష్టం చేసిన కేంద్రం... ఇప్పటిదాకా కేటాయించిన రూ.2,050 కోట్లతోనే సరిపెట్టుకోవాలని చెప్పింది. ఈ మేరకు ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో జరిగిన సమావేశంలో కేంద్రం... రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారుల ముందు వితండ వాదన చేసిన వైనం నిన్న వెలుగు చూసింది. భేటీలో విభజన చట్టంలోని 94(3) సెక్షన్ ను బయటకు తీసిన కేంద్రం... సదరు సెక్షన్ ప్రకారం రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవనాలను మాత్రమే తాము నిర్మించాల్సి ఉందని చెప్పింది. ఈ భవనాలన్నింటినీ రూ.2,050 కోట్లతోనే నిర్మించుకోవచ్చని వాదించింది. ఇది సాధ్యం కాదని ఏపీ భావిస్తే... ఆ నిధులను వెనక్కిస్తే తామే వాటిని నిర్మించి ఇస్తామని కూడా కేంద్రం చెప్పడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల నోట మాట రాలేదట.

  • Loading...

More Telugu News