: రోజూ వ్యాయామం చేయడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుందట!
క్రమం తప్పని వ్యాయామం వల్ల శారీరకంగా బాగా దృఢంగా తయారవుతారన్న సంగతి తెలిసిందే. అయితే వ్యాయామం కేవలం ఫిట్ నెస్ కు మాత్రమే కాదని, మెదడుకు కూడా చాలా మంచిదని న్యూయార్క్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం, మెదడు పనితీరుపై వారు చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని వారు తెలిపారు. అంతేకాకుండా డెమెన్షియా (చిత్తవైకల్యం) రాకుండా కాపాడుతుందని వారు చెప్పారు. డెమెన్షియా కారణంగా సంభవించే మతిమరుపు, ఏకాగ్రతా లోపం, పూర్తి స్థాయిలో ఏ పని చేయలేకపోవడం వంటి లక్షణాలు పోతాయని తేలిందని వారు చెప్పారు. అలాగే నాడీ, నరాల సంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఈ పరిశోధనలో తేలిందని వారు వెల్లడించారు.