: నా చేతిలో ఉన్న కత్తితో వాళ్లను తరిమాను!: 'అసెంబ్లీ రౌడీ' షూటింగ్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్న మోహన్ బాబు
డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రం విడుదలై రేపటితో పాతికేళ్లు పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు బి.గోపాల్, రచయిత పరచూరి గోపాలకృష్ణతో కలిసి మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ, "తమిళంలో వచ్చిన ‘వేలైడి కడైచుడుచ్చు’ సినిమాకు రీమేక్ ‘అసెంబ్లీ రౌడీ’. ఈ చిత్రానికి దర్శకత్వం వహించమంటే దర్శకుడు గోపాల్ ‘సరే’ అన్నాడు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. తిరుపతి దగ్గర తిరుచానూర్ లో ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు... కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఐదుగురు అక్కడికి వచ్చి గొడవ చేశారు. మాకు భద్రతగా ఉన్న ఒక కానిస్టేబుల్ ను కొట్టబోయారు. అప్పుడు, నా చేతిలో ఉన్న కత్తితో వాళ్లను తరిమికొట్టాను. వాళ్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించాం’ అని నాటి సంగతులను మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ‘అసెంబ్లీ రౌడీ’ రీమేక్ ను విష్ణు చెయ్యాలని అనుకుంటున్నాడని డైలాగ్ కింగ్ తెలిపారు. అనంతరం దర్శకుడు గోపాల్ మాట్లాడుతూ, సెట్స్ పై మోహన్ బాబు నటిస్తుంటే, తాను డైరెక్టర్ లా కాకుండా ఒక ప్రేక్షకుడిలా అలాగే చూస్తుండిపోయేవాడినని అన్నారు.