: చంద్రబాబును తిట్టాడంటూ జగన్ పై వర్ల రామయ్య కేసు
అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యల దుమారం కేసు పెట్టేవరకు వెళ్లింది. జగన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కేసు పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన కృష్ణా జిల్లా పామర్రు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు జగన్ పై ఐపీసీ 154 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మరోసారి వర్ల, జగన్ పై విమర్శలకు దిగారు.