: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అల్లుడు కన్నుమూత


దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మూడో అల్లుడు దయాకర్ రావు(70) ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మృతి చెందారు. దయాకర్ రావు అంత్యక్రియలు మహా ప్రస్థానం శ్మశాన వాటికలో ఆదివారం నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, పీవీ నరసింహారావు మూడవ కుమార్తె వాణీదేవి భర్త అయిన దయాకర్ రావు సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గా ఉన్నారు.

  • Loading...

More Telugu News