: అమ్మలేని లోటును తీర్చిన టీచర్ కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన నర్సరీ విద్యార్థిని!


సమాజంలో ఎవరికీ లేని గొప్ప బాధ్యత టీచర్లపై ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడంలో వారి పాత్ర అమోఘం. ఆ పాత్ర సరిగ్గా నిర్వర్తిస్తే కలిగే మానసిక అనుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు. అలాంటి ఓ టీచర్ కు నర్సరీ చదువుతున్న బాలిక మర్చిపోలేని బహుమతి ఇచ్చి సత్కరించింది. కువైట్ లోని ఓ కిండర్ గార్టెన్ స్కూల్ లో నూర్ ఆల్ ఫరిస్ అనే బాలిక చదువుతోంది. మధ్యలో బాలిక తల్లి మరణించింది. దీంతో నూర్ ను ఆమె టీచర్ కంటికిరెప్పలా చూసుకుంది. నూర్ కోలుకునేందుకు ఆమె ఎంతగానో సహకరించింది. ఈ క్రమంలో ఆ చిన్నారికి నర్సరీ విద్య పూర్తయింది. ఇప్పుడు దీంతో తన అభిమాన టీచర్ కు గిఫ్ట్ ఇవ్వాలని తండ్రికి చెప్పింది. అంతే, తన కుమార్తెకు ఇంత చేసిన టీచర్ కు ఏమిచ్చినా రుణం తీరదని భావించిన ఆ తండ్రి మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ఆ కారుపై నా అభిమాన టీచర్ నదియాకు నూర్ గిఫ్ట్ అంటూ అరబిక్ భాషలో రాయించి మరీ ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చిన సందర్భంగా నూర్ కారు బానెట్ పై కూర్చుని ఫోటోలకు చిరునవ్వులు చిందించింది.

  • Loading...

More Telugu News