: విమర్శలకు సమాధానం చెప్పిన హేమమాలిని


ఉత్తరప్రదేశ్ లోని మధురలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు తలెత్తి 24 మంది మృత్యువాత పడితే సినిమా షూటింగ్ లో ఎంజాయ్ చేస్తారా? అంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని సమాధానం ఇచ్చారు. తాను ఈ సినిమా షూటింగ్ కోసం ఎప్పుడో కాల్షీట్లు ఇచ్చేశానని అన్నారు. ఇలా జరుగుతుందని ముందు ఊహించలేదని ఆమె చెప్పారు. విషయం తెలిసిన వెంటనే మధుర బయల్దేరుతున్నానని ఆమె ట్వీట్ చేశారు. కాగా, మధురలో చోటుచేసుకున్న ఘర్షణలపై బ్రేకింగ్ న్యూస్ తో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న వేళ... ఈ రోజు షూటింగ్ లో చాలా ఎంజాయ్ చేశానంటూ హేమమాలిని నేటి ఉదయం ట్వీట్ చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఆమె మధుర వెళ్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News