: కేఈ ప్రభాకర్ పై సస్పెన్షన్ వేటు?
రాజ్యసభ సీటును టీజీ వెంకటేశ్ కు కేటాయించడాన్ని నిరసిస్తూ కర్నూలు టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన కేఈ ప్రభాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ అధిష్ఠానం తీవ్రంగా స్పందించిన నేపథ్యంలోనే కేఈ ప్రభాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ, టీడీపీ పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఉపేక్షించమని ఆయన హెచ్చరించారు.