: ముస్తాఫిజుర్ ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవచ్చు: బంగ్లా కోచ్


ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడే అరుదైన అవకాశాన్ని ముస్తాఫిజుర్ వినియోగించుకుంటానంటే తమకు అభ్యంతరం లేదని బంగ్లాదేశ్ జట్టు కోచ్ చండిక హతురసింగ తెలిపారు. ఢాకాలో ఆయన మాట్లాడుతూ, తాను ఫిట్ గా ఉండి ఆడుతానంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే ముందుగా ఫిట్ నెస్ పరీక్షించుకోవాలని అన్నారు. వచ్చే ఏడాది ఇంగ్లండ్ లో బంగ్లా జట్టు పర్యటించనున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ కౌంటీల్లో ఆడడం తమకు లాభిస్తుందని ఆయన చెప్పారు. ఐపీఎల్ లో ముస్తాఫిజుర్ రాణించడంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్ జట్టు తరపున ఆడేందుకు అతనికి అవకాశం వచ్చిందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే వాళ్ల కోచ్ ఈ ప్రకటన చేశాడు.

  • Loading...

More Telugu News