: కొనుక్కున్న ఫ్రిజ్‌లో మృతదేహం.. మహిళకు భయంకర అనుభవం!
ఓ సెకండ్ హ్యాండ్ ఫ్రిజ్‌ని కొనుక్కున్న ఓ మహిళకు దాన్ని తెరచి చూడగానే దానిలో మృతదేహం కనిపించిన సంఘటన అమెరికాలోని ఉత్తర కరోలినాలో చోటుచేసుకుంది. తన పొరుగింట్లో ఉన్న ఓ మహిళ దగ్గర్నుంచి ఫ్రిజ్ కొనుక్కున్న మహిళకు ఈ భయంకర అనుభవం ఎదురయింది. ప్రిజ్‌లో మృతదేహం కనిపించగానే షాక్ అయిన ఆ మహిళ తరువాత తేరుకుని పోలీసులకి ఈ విషయాన్ని తెలిపింది. ఆ మృతదేహం ఎవరిదో కూడా మహిళ గుర్తించింది. ఇంటికి వచ్చిన పోలీసులకి ఆ మృతదేహం తనకు ఫ్రిజ్‌ను అమ్మేసిన తన పొరుగింటి మహిళ తల్లిదేనని ఆమె చెప్పింది. కాగా, మహిళకు ప్రిజ్‌ను అమ్మిన పొరుగింటి మహిళ పరారీలో ఉంది. ఫ్రిజ్‌ను అమ్మేసిన మరుసటి రోజే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిందని ప్రిజ్‌ను కొన్న మహిళ తెలిపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.