: కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో మెరిసిన హెచ్‌సీయూ విద్యార్థులు
గత కొన్ని నెలలుగా వివాదాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోన్న విషయం తెలిసిందే. అయితే, వర్సిటీ విద్యార్థులు మాత్రం వివాదాల్లో పడి చదువుని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయట్లేదని తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో హెచ్‌సీయూ విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. ఎకనామిక్స్ లెక్చరర్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షలో హెచ్‌సీయూలో పీహెచ్డీ చేస్తోన్న స్కాలర్ అంజు సుసన్థామస్ తొలి ర్యాంకర్‌గా నిలిచారు. అలాగే వర్సిటీ విద్యార్థులు జానకి నాలుగో ర్యాంకు సాధించగా, గోపిక అయిదో ర్యాంకు సాధించారు. అంతేగాక 7, 22, 47, 54 వ ర్యాంకులు కూడా హెచ్‌సీయూ విద్యార్థుల సొంతమయ్యాయి.