: జగన్ ను మహిళలు చీపుర్లతో తరిమికొడతారు: ఏపీ మంత్రి పీతల సుజాత


ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జగన్ ను మహిళలు చీపుర్లతో తరిమికొడతారని ఆవేశంగా అన్నారు. తన తండ్రిని జగన్ ఇదేమాదిరి మాట్లాడతారా? అని ఆమె ప్రశ్నించారు. 'పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన జగన్ కు సగం పిచ్చెక్కెపోయింది. ఈయన మానసిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఇప్పుడు ఒక సైకోలా తయారైపోయి, ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియడం లేదు. పెద్దా చిన్నా తారతమ్యం లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. జగన్ త్వరలోనే సెపరేట్ గా ఒక పిచ్చాసుపత్రిని పులివెందులలోనే కట్టించుకోవాల్సిన పరిస్థితులు తెచ్చుకుంటున్నాడు' అని మంత్రి సుజాత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News