: హైదరాబాద్‌ని మ‌రోసారి ప‌ల‌క‌రించిన వర్షం


హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌ర్షం మ‌రోసారి ప‌ల‌కరించింది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం ప‌డ‌డంతో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. కొన్ని చోట్ల గాలి వాన‌తో వ‌ర్షం ప‌డితే, కొన్ని చోట్ల చిరుజ‌ల్లులు ప‌డ్డాయి. ఉప్ప‌ల్, బీబీ న‌గ‌ర్, ఘ‌ట్‌కేస‌ర్ పరిస‌ర ప్రాంతాల్లో ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డింది. దిల్‌సుక్ న‌గ‌ర్‌, కొత్త‌పేట, ఎన్టీఆర్ న‌గ‌ర్ ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు ప‌డ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. గత రెండు రోజులుగా అధిక ఉష్ణోగ్ర‌త‌తో ఎండ‌ల్ని చూసిన న‌గ‌ర‌వాసులు, నేడు కురిసిన వ‌ర్షంతో ఉప‌శ‌మ‌నం పొందుతున్నారు.

  • Loading...

More Telugu News